విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ క్షేత్రాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం సందర్శించారు. ఆలయ మర్యాదలతో లోకేశ్‌కు దేవాదాయశాఖ కమిషనర్, పాలకమండలి ఛైర్మన్, ఇతర సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారికి సుమంగళ ద్రవ్యాలను సమర్పించిన లోకేశ్, అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనలం పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆయనకు అందించి సత్కరించారు. భక్తులకు అసౌకర్యం లేకుండా మెరుగైన రీతిలో దర్శనం కలిగేలే సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపొందించి అమలు చేద్దామని లోకేశ్ హామీ ఇచ్చారు.