శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది. లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును యంత్రాల సహాయంతో బయటకు తీస్తున్నారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16వ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

