సివిక్ పోల్ అనాలసిస్ కమిటీ (సీప్యాక్) తమిళనాడు అసెంబ్లీపై తన అంచనాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే మొత్తం 234 మంది సభ్యులు ఉన్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజన కనిపించింది. డీఎంకే కూటమికి మొత్తంగా 128 సీట్లు లభిస్తాయని పేర్కొంది.ఏఐఏడీఎంకే ఓట్లన్నింటినీ కూడా విజయ్ తన్నుకుపోయే అవకాశాలు ఉన్నట్లు సీప్యాక్ అభిప్రాయపడింది. ఏకంగా టీవీకే 98 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

