కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఓబుల్ రెడ్డి పేటలో మద్యానికి బానిసై ప్రతిరోజు తల్లిని వేధిస్తున్న తండ్రి పిరాన్ భాషను మైనర్ బాలుడైన పదవ తరగతి విద్యార్థి పదునైన ఆయుధంతో కొట్టాడు.. అది తగలరాని చోట తగిలి తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. చంపాలి అనే ఉద్దేశం లేకపోయినా తన తల్లిని వేధిస్తున్న సమయంలో అడ్డుపడి తల్లికి రక్షణగా నిలవాలనుకున్నాడు. అయితే అదే సమయంలో చేతికి దొరికిన పదునైన ఆయుధంతో తన తండ్రిని కొట్టడంతో అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు.

