లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన పోస్ట్ చేశారు. ఎన్నికల ఉపశమనం ముగిసింది. ‘ఇక ద్రవ్యోల్బణం వేడి తగలబోతుంది. ఏప్రిల్ 29వ తేదీ తరువాత పెట్రోల్, డీజిల్ సహా అన్ని రకాల ధరలు పెరగబోతున్నాయి. ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలతో జేబులు నింపుకున్నది. ఇప్పుడు ధరలు పెరగడంతో ఆ భారాన్ని ప్రజలపై వేయబోతుంది. ధరలు తక్కువ ఉన్నప్పుడు దోచుకునే ప్రభుత్వం.. ద్రవ్యోల్బణం అంటూ ప్రజలపైకి భారాన్ని నెడుతోంది’ అని పోస్ట్ చేశారు.

