రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025కు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్ల ప్రాతిపదికన ఉద్యోగుల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి జీఏడీ మార్గదర్శకాలు విడుదల చేస్తే.. అన్ని విభాగాలు బదిలీలు, సర్దుబాటు, పదోన్నతులకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అన్ని శాఖలు.. ఉద్యోగుల సీనియారిటీ, పని చేస్తున్న జిల్లా తదితర వివరాలన్నీ ఆన్ లైన్ లో నమోదు చేశాయి.

