విశాఖపట్నం వేదికగా భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక మహా విప్లవానికి శ్రీకారం చుట్టిందని అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ ప్రకటించారు. 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న హైపర్
స్కేల్ ఏఐ డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్దదని, ఇది భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 1.3 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం ఉండగా, ఒక్క విశాఖలోనే 1 గిగావాట్ ఏర్పాటు చేయడం విశాఖ ప్రాముఖ్యతను చాటిచెబుతోందని అన్నారు.

