విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. విశాఖ జిల్లా తర్లువాడలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.గూగుల్ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో మూడు చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. వీటిలో ముందుగా తర్లువాడలో 266.6 ఎకరాల్లో తొలి దశ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.

