ప్రధాని నరేంద్ర మోదీ కొత్త అవతారం ఎత్తారు.. తాను ఎప్పుడూ ధరించే కుర్తా-పైజామాను పక్కన పెట్టి ట్రాక్ ప్యాంటు, స్పెక్ వేసుకున్నారు. రెండు రోజుల సిక్కిం పర్యటనలో ఉన్న మోదీ గ్యాంగ్ టక్ లో మంగళవారం అక్కడి యువతతో ఫుట్ బాల్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత మోదీ సిక్కిం పర్యటనకు వెళ్లారు. సోమవారం సిక్కిం చేరుకున్న ప్రధాన మంత్రికి ఆ రాష్ట్ర గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఘన స్వాగతం
పలికారు.

