అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన ఇరాన్ సంతతి మహిళా వ్యాపారవేత్త, 44 ఏళ్ల షమీమ్ మాఫి ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేసేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే ఆరోపణలపై యూఎస్ అధికారులు ఆమెను శనివారం రాత్రి లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు ‘మొహాజెర్-6’ సాయుధ డ్రోన్లను సరఫరా చేసేందుకు ఆమె ఏకంగా 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆధారాలు లభించాయి.

