కోయంబత్తూరులో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసిన చంద్రబాబు..అనంతరం డీఎంకే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో డీఎంకే మహిళా బిల్లును ఓడించిందని ఆరోపించారు. తద్వారా డీఎంకే, ఇండీ కూటమి మొత్తం మహిళల్నే ఓడించాలని చంద్రబాబు తెలిపారు. గతంలో ప్రోగ్రెసివ్ రాష్ట్రంగా ఉన్న తమిళనాడు ఇప్పుడు ఆర్ధికంగా వెనుకబడిందన్నారు. తమిళనాడులో చాలా కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో డీఎంకే సమాధానం చెప్పాలని చంద్రబాబు కోరారు.

