అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు మితాజెన్-అజయ్ కుమార్‌లు రాజంపేటలో నివసిస్తున్నారు. మితాజెన్ చెల్లెలు కూడా ఈ దంపతులతో కలిసి ఉంటుంది.చెల్లెలు సెల్‌ఫోన్ ఎక్కువ వీక్షిస్తుండడంతో పలుమార్లు మందలించారు. సెల్‌ఫోన్ మాయ నుంచి ఆమె బయటకు రాకపోవడంతో ఫోన్‌ను అక్కాబావ పగులగొట్టారు. యువతి మానస్థాపానికి గురై రూమ్‌లో ఉరి వేసుకుంది. వెంటనే దంపతులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

