ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కష్టపడి పనిచేసే ఏపీ సీఎం, ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఆయనకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

