తెలంగాణ ముఖ్యమంత్రి పేరిట ఇచ్చే ఎలైట్ లాంజ్ టిక్కెట్లతో హీరోయిన్ కుషితా కల్లాపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు చూసేందుకు వెళ్తోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సీఎం పేరు మీదున్న టిక్కెట్ ఫోటోలను పెట్టడంతో ఈ విషయం బయటపడింది. దాంతో, సీఎంవో టిక్కెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా? లేదంటే బ్లాక్లో అమ్ముతున్నారా? అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలైట్ లాంజ్ టిక్కెట్ల విలువ రూ. 40,000లు ఉంటుంది. ఇంత ఖరీదైన టికెట్లను ఉచితంగా హీరోయిన్లకు పంచుతున్నది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.

