గచ్చిబౌలి నుండి పాలకొల్లుకు బయల్దేరిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సుకొండాపూర్, మియాపూర్ మీదుగా కేపీ హెచీ (KPHB) ప్రాంతానికి చేరుకోగానే, ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. బస్సులో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దిగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

