రాజన్న సిరిసిల్ల జిల్లా వల్లంపట్ల గ్రామంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద నిర్మించిన అదనపు పాఠశాల గదులు, కిచెన్ షెడ్డుకు మాజీ సర్పంచ్ అనసూయ తాళం వేసి బకాయిలు క్లియర్ చేసే వరకు తాళం తీసేది లేదని ఆమె స్పష్టం చేసింది. నిర్మాణ పనులు పూర్తయినా, వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా చెల్లించలేదని అనసూయ ఆరోపించారు.వెంటనే విద్యాశాఖ అధికారులు, స్థానిక పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

