కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో గురువారం వేకువజామున గుండెలు పిండేసే ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగళూరు నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తుల వాహనాన్ని కాలయముడిలా వచ్చిన ఒక రెడీమిక్స్ లారీ బలంగా ఢీ కొట్టింది. బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యి బోర్లా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 16 మంది ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు.

