హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై ఇరాన్ స్పందించింది. ‘హర్మూజ్’ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా.. జలసంధిలో ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకుపోతారని హెచ్చరించింది. ఈ మేరకు ఐఆర్జీసీ నౌకాదళ విభాగం సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది

