ఒకపక్క ఇరాన్-అమెరికా మధ్య చర్చల అంశం నడుస్తోంది. కానీ, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై దాడులు చేస్తూ తన పని కానిచ్చేస్తోంది.దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా వంటి తీవ్రవాద స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. అది కూడా మామూలుగా కాదు.. ఏకంగా లెబనాన్‌లోని కొన్ని గ్రామాల్నే ఇజ్రాయెల్ తుడిచిపెట్టేస్తోంది. లెబనాన్‌లోని ఇండ్ల మధ్యలో తవ్వి, పేలుడు పదార్థాలు పెడుతోంది. తర్వాత వాటిని రిమోట్‌తో పేల్చేస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతాలైన తయ్బే, నకోరా, డైర్ సిరియన్ వంటి ప్రాంతాల్లోని అనేక గ్రామాలు కనుమరుగయ్యాయి.

