ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మేడ్చల్ 77.31 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ బాలికలు (82.47%) బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 73.04 శాతంతో మూడో స్థానంలో నిలిచి బాలికలు 78.72 శాతం పాస్ కాగా, బాలురు 66.72 శాతం మంది పాసయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేవలం 49.05 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఇక్కడ బాలుర ఉత్తీర్ణత చాలా తక్కువగా (28.03%) ఉంది.

