ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన ఆశా… 8 దశాబ్దాల కెరీర్‌లో తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె కెరీర్ ఓసారి చూస్తే… 1933లో మహారాష్ట్రలోనే సాంగ్లీలో జన్మించిన ఆశా భోస్లే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టంతో పదేళ్ల వయసు నుంచే పాటలు పాడడం మొదలుపెట్టారు.

