తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన‘జన నాయగన్’ సినిమా కీలక సన్నివేశాలు ఆన్లైన్లో ప్రత్యక్షమవ్వడం వెనుక సెన్సార్ బోర్డు హస్తం ఉందంటూ వస్తున్న వార్తలను సంస్థ, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, వాస్తవాలకు దూరమని పీఐబీ మహారాష్ట్ర ప్రకటనలో పేర్కొంది. ‘జన నాయగన్’ డిజిటల్ సినిమా ప్యాకేజీ (DCP)ని మార్చి 17వ తేదీనే ముంబైలో నిర్మాతలకు అప్పగించామని, సినిమా కంటెంట్ మొత్తం పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని, కీ డెలివరీ మెసేజ్ (KDM) కేవలం నిర్మాత వద్ద మాత్రమే ఉంటుందని వివరించింది.

