తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను రేపు 12వ తేదీన విడుదలకు సర్వం సిద్ధం చేసింది. విద్యార్థులు 80969 58096 నంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకుని, వాట్సాప్ నుండి ‘Hi’ అని మెసేజ్ పంపాలి. తర్వాత ‘BIE Exam Result’ అని టైప్ చేసి, అడిగిన వివరాలు (హాల్ టికెట్ నంబర్) ఎంటర్ చేయడం ద్వారా క్షణాల్లో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల వెల్లడి అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ ద్వారా కూడా తమ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

