ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం జిల్లాలోని కీసర టోల్‌ప్లాజా దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఓ భారీ ట్యాంకర్ లారీ అదుపుతప్పి.. బిఎండబ్ల్యూ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో లారి కింద కారు చిక్కుకుని నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

