వన్యప్రాణుల సంరక్షణ, పశువైద్య శాస్త్రాలపై ప్రపంచంలోనే తొలి విశ్వవిద్యాలయాన్ని గుజరాత్‌లోని జామ్ నగర్లో ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన వంతారా శుక్రవారం ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వంతారా విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని జామ్‌నగర్‌లోని వంతారా ప్రాంగణంలో హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ప్రాంగణంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ వైల్డ్‌లైఫ్ – వెటర్నరీ యూనివర్సిటీని నిర్మించనున్నారు. అట్టహాసంగా విశ్వవిద్యాలయం శంకుస్థాపన

