అమరావతి నిర్మాణంపై వైసీపీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అమరావతి ప్రాజెక్టు వాస్తవానికి సాధ్యంకాని ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు అమరావతిలో సాధారణ ప్రజల కోసం కాకుండా కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తుల కోసం విలాసవంతమైన బంగ్లాలు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయిలో భూమి ధరలు నిర్ణయించి ప్రజలు అక్కడ ఎలా నివసిస్తారని ప్రశ్నించారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు భావితరాలపై భారం మోపడం అవుతుందని విమర్శించారు.

