అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమాదకర జలపాతాల వద్ద సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. సరదాగా జలపాతాలు వద్ద గడిపేందుకు వెళ్ళిన నలుగురు బాలికలు అనంతగిరి మండలం మూలగుమ్మిలో సెల్ఫీ దిగుతూ జలపాతంలో పడిపోయారు. వేసవి కావడంతో సరదాగా ఈతకు వెళ్లి నలుగురిలో , త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలిక అంజలి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు.

