పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం తహశీల్దార్ కార్యాలయం అవినీతి కేంద్రంగా మారుతున్నట్లు మరో ఘటన రుజువైంది. భూమి ఎంక్వయిరీ పనిలో సహాయం చేస్తానంటూ రైతు వెంకటస్వామి నుంచి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందుగానే ప్రణాళిక రచించి వల పన్నారు.

