ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ మేరకు నిన్న ఒక్కరోజే భారీ మొత్తంలో నిధులను విడుదల చేయడం గమనార్హం. ఈ నిధులు ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ వెల్లడించారు. పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు.

