సోషల్ మీడియాలో సాగుతున్న అరాచకాలు, వివాదాస్పద ఫ్లెక్సీలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలతో దూషించడం అంటే, ఆ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుకౌట్ నోటీసుల రద్దు కేసులో తీర్పును రిజర్వ్ చేసింది.

