రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని విజ్ఞాన్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ సరిగా చేయలేదనే కారణంతో రెండో తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ తీవ్రంగా కొట్టాడు. విద్యార్థి నొప్పితో తల్లడిల్లితూ ఇంటికి చేరింది. చిన్నారి శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లి నిలదీశారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థినిని సంబంధిత టీచర్ వాతలు వచ్చేలా చితకబాదినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

