ఆర్టెమిస్ 2 వ్యోమగాములు ప్రస్తుతం చంద్రుడికి వెనుకవైపు ఉన్నారు. ఈ ఆర్టెమిస్ 2 వ్యోమగాములను సురక్షితంగా భూమికి తిరిగి రావడంపై తుది సన్నాహాలు జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ నెల 11 తెల్లవారు జామున 5:37 నిమిషాలకు పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ క్యాప్సూల్ స్ప్లాష్‌డౌన్ అవుతుంది. నాసా అంచనాల ప్రకారం గరిష్టంగా సెకనుకు 38,367 కిలోమీటర్ల వేగంతో ఆర్టెమిస్ 2 ఓరియన్ క్యాప్సుల్ తిరిగి భూ కక్ష్యలోకి ప్రవేశించవచ్చు. ఇది అపోలో 10 రికార్డు గరిష్ట వేగం 39,938 కిలోమీటర్ల కంటే తక్కువ.

