ఇరాన్ నుంచి వచ్చిన మూడు వేర్వేరు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని వాన్స్ పేర్కొన్నారు. తొలుత 10 పాయింట్లతో ఒక ప్రతిపాదనను పంపించినట్లు వెల్లడించారు. అయితే, అది చాటిజీపీటీ రాసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.మూడో వర్షన్ మొదటి దానికంటే అత్యంత దారుణంగా ఉందని, అంగీకరించలేనివిధంగా అందులో డిమాండ్లు ఉన్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ మూడో ప్రతిపాదన గురించి తమకు తెలిసిందన్నారు.

