తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నాదర్ గుల్ భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్ రావు ఆరోపిస్తున్న నాదర్‌గుల్ సర్వే నంబర్ 613లోని భూములకు సంబంధించి పొంగులేటి కీలక ఆధారాలను బయటపెట్టారు. ఆ భూములను 2014లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడు ప్రైవేట్ సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు. 2016లో మ్యూటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ అధికారంలోనే ఉందని, అప్పుడు జరిగిన రిజిస్ట్రేషన్లకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధమని ఆయన నిలదీశారు.

