బనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు భీకరంగా విరుచుకుపడ్డాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100 హిజ్బుల్లా స్థావరాలపై 160 బాంబులు కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడులతో లెబనాన్ రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ ఈ దాడులను ‘ఎటర్నల్ డార్క్‌నెస్’ అనే కోడ్ నేమ్‌తో నిర్వహించినట్లు సమాచారం. హిజ్బుల్లాకు చెందిన కమాండ్ సెంటర్లు, నిఘా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.

