‘హార్ముజ్ జలసంధి’ ఇప్పుడు ఈ ఆర్థిక యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది. ఈ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుండి ఇరాన్ రవాణా రుసుములను చైనా కరెన్సీ అయిన ‘యువాన్’ రూపంలో వసూలు చేయడం ప్రారంభించింది. ఇది అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో “పెట్రోయువాన్” వ్యవస్థను బలోపేతం చేసే దిశగా వేసిన కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. అమెరికా తన ప్రత్యర్థి దేశాలను నియంత్రించడానికి డాలర్ శక్తిని వాడుకుంటోందని, అందుకే ఇరాన్, చైనాలు ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి యువాన్‌ను ప్రోత్సహిస్తున్నాయి.

