కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ఆరంభంలోనే బ్యాంకింగ్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఊరటనిచ్చింది. బుధవారం ముగిసిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర బ్యాంక్, పాలసీ రెపో రేటును 5.25% వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా మీ ఈఎంఐ (EMI)లు పెరగవు అనే స్పష్టత వచ్చింది. రెపో రేటు: 5.25% (మార్పు లేదు), స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF): 5%, MSF & బ్యాంక్ రేటు: 5.5%

