హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నగరంలో చిలకలగూడ,ఆదిభట్ల, సనత్‌నగర్‌లో మూడు చోట్లు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. పెద్ద మొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.65 లక్షలు ఉంటుందని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. ఈ మూడు కేసుల్లో ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌తో పాటు స్థానిక డ్రగ్ పెడ్లర్, ముగ్గురు సబ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.