ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యోమగాములు.. తిరిగి భూమి వైపు తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే చందమామ అవతలి వైపు నుంచి వ్యోమగాములు తీసిన భూమి ఫొటోను ‘నాసా’ విడుదల చేసింది. దీన్ని వైట్‌హౌస్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది. ‘‘జాబిల్లి అవతలి వైపు నుంచి తీసిన మొదటి భూమి ఫొటో ఇది’’ అని పేర్కొంది.

