రేవంత్ ఆరోపణలను తిప్పికొడుతూ విజయన్ అత్యంత ఘాటుగా లేఖ రాశారు. తోటి ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు చేయడం, ఎక్స్‌పైరీ డేట్ వంటి పదజాలం వాడటం రాజకీయాల్లో సంస్కారం కాదని విజయన్ హితవు పలికారు. ఆర్టికల్ 131 కింద కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. అభివృద్ధి సూచీలో కేరళ 79 పాయింట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే, రేవంత్ పాలిస్తున్న తెలంగాణ 6వ స్థానంలో ఉందని ఎత్తి చూపారు.

