మధ్యప్రాచ్య యుద్ధ విరమణ దిశలో మధ్యవర్తిత్వ దేశాలు ఈజిప్టు, పాకిస్థాన్, టర్కీలు రూపొందించి ఈ ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్లకు పంపించాయి. అయితే తాత్కాలిక యుద్ధ విరమణకు తాము అంగీకరించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తిత దేశం పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తమ వైఖరిని తెలియజేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ సోమవారంనాడు రాత్రి ప్రకటించింది. ‘తాత్కాలిక కాల్పుల విరమణకు మేం సిద్ధంగా లేము. అని కైరోలోని ఇరాన్ దౌత్యవేత్త మొజ్తాబా ఫిరదౌసి వ్యాఖ్యానించారు.

