ఏపీపై జగన్ పగబట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాడికి మార్కెట్ యార్డ్లో జరిగిన భారీ బహిరంగ సభలో విమర్శించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్’గా మార్చేందుకు 1 లక్ష కోట్లు ఖర్చు చేస్తామని, అందులో ప్రభుత్వ వాటాగా 30 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. తాడిపత్రిలో రౌడీయిజానికి తావులేదని, అభివృద్ధికి మాత్రమే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ముఖ్యమంత్రికి రాజధాని అమరావతి లోగోతో కూడిన ప్రత్యేక బ్యాడ్జ్ను బహుకరించారు.

