‘సాగునీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ ఉదయం అమరావతి నుంచి బయల్దేరిన సీఎం తాడిపత్రి వెళ్లారు. మధ్యాహ్నం యాడికి మండలం వేములపాడు మార్కెట్ యార్డు సమీపంలోని ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. అక్కడ పెండేకల్లు రిజర్వాయర్ పనులు పరిశీలించారు. హంద్రీనీవా కాల్వ ద్వారా ప్రయోజనాలు పొందుతున్న రైతులతో సీఎం మాట్లాడారు. కాల్వ విస్తరణ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకున్న నీటి ప్రవాహాలు, సాగు ప్రాంతాలు, నీటి లభ్యత వంటి అంశాలపై వారితో చర్చించారు.

