అస్సాం ఎన్నికలను పాకిస్థాన్ ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. “గౌరవ్ గొగోయ్‌కు పాకిస్థాన్ ఎందుకు సాయం చేస్తోంది? మీరు పాకిస్థాన్ సోషల్ మీడియా గ్రూపుల సాయం ఎందుకు తీసుకుంటున్నారు? ఆ దేశంతో మీకున్న రహస్య బంధాన్ని ఎందుకు వెల్లడించరు?” అని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ తన విలేకరుల సమావేశాల్లో ప్రదర్శించిన సమాచారమంతా పాకిస్థాన్ నుంచి సరఫరా అయ్యిందని, దీని వెనుక దేశ వ్యతిరేక శక్తుల హస్తం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ.

