కేరళకు చెందిన జీఎస్ శరణ్య అనే 36 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ ఏప్రిల్ 2న కర్ణాటక తడియాండమోల్ అటవీ ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసం అటవీ అధికారుల వద్ద రిజిష్టర్ చేసుకుంది. ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయని, సాయంత్రంకల్లా మరో 10 మంది బృందంతో కలిసి వెళ్లి తిరిగి రావాలని అధికారులు కోరారు. ఆమె పేరు, వివరాలు నమోదు చేసుకుని అనుమతించారు. సాయంత్రం ఆమె మినహా అందరూ తిరిగొచ్చారు. దీంతో శరణ్య మిస్ అయినట్లు గుర్తించారు. కర్ణాటక ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది.

