ీకెండ్లో హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్టులో శనివారం అర్ధరాత్రి తెలంగాణ ఈగల్ టీం నిర్వహించిన తనిఖీల్లో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం రోజు తారామతి బారామతి రిసార్టులో ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో ఓ ప్రైవేట్ ఈవెంట్ నిర్వహించారు. సుమారు 36 మందిని డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆరుగురికి పాజిటివ్ అని తేలింది.
డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణైన వారిలో ఒక యువతి కూడా ఉన్నట్లు సమాచారం.