ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమరావతిలో రూ. 57,821 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిని యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడంలో ఎదురైన సవాళ్లను అధిగమించి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

