చంద్రుడిని చుట్టి వచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఇటీవల ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని నిర్వహించింది. నలుగురు వ్యోమగాములతో రాకెట్ గురువారం (భారత కాలమానం ప్రకారం) తెల్లవారుజామున 3.54 గంటలకు చంద్రుడివైపు విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. ఈ దృశ్యాలను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించి ఆశ్చర్యపోయారు. అయితే, విమానంలో వెళుతున్న ఒక వ్యక్తి కూడా ఈ ప్రయోగాన్ని రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది

