చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉమ్మడి పౌరస్మృతి (UCC)తో అడ్డుకునే వీలుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. గిరిజనాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ
సమగ్ర మ్యాప్ సిద్ధం చేశారని అమిత్షా తెలిపారు. దీనిని ముందుకు తీసుకువెళ్లి, సమర్ధవంతంగా అమలు చేయాలంటే బీజేపీకే ప్రజలు ఓటు వేయాలని కోరారు. మోదీ నాయకత్వంలో తొలిసారి గిరిజన మహిళ దేశ అధ్యక్షురాలు అయిన విషయాన్ని గుర్తు చేశారు.

