ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్థానికంగా జరిగిన జాతరలో ఎత్తుల భాస్కరరావు అనే దళిత వ్యక్తి డప్పు కొడుతుండగా, ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై అతడి చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. స్పీకర్ వంటి ఉన్నత
రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, బహిరంగంగా ఒక సామాన్యుడిపై, అందునా దళితుడిపై ఇలా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు స్పీకర్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

